శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (12:32 IST)

నిర్మల్ జిల్లాలో బోల్తాపడిన ప్రైవేట్ బస్సు - 17 మందికి గాయాలు

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలోని కొండాపూర్‌ బైపాస్‌ వద్ద భారీ ప్రమాదం తప్పింది. నిర్మల్‌ గ్రామీణ పరిధిలోని కొండాపూర్‌ బైపాస్‌ వద్ద ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. 
 
80 మంది ప్రయాణికులతో ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళుతుండగా, ఈ ప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున కొండాపూర్‌ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 17 మంది తీవ్రంగా గాయపడగా, మరో 15 మందికి స్వల్పంగా దెబ్బలు తగిలాయి. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను నిర్మల్‌ ఏరియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.