గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్

తెలంగాణాలో 6 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం

తెలంగాణా రాష్ట్రంలో ఇంజి‌నీ‌రింగ్‌ కోర్సుల్లో ప్రవే‌శాల కోసం ఎంసెట్‌ తుది‌వి‌డ‌త‌తో‌పాటు స్పెషల్‌ రౌండ్‌ కౌన్సె‌లింగ్‌ షెడ్యూల్‌ మంగ‌ళ‌వారం విడు‌ద‌లైంది. ఇందులోభాగంగా ఈ నెల 6వ తేదీన కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. 
 
ఇప్ప‌టికే తొలి‌వి‌డత కౌన్సె‌లింగ్‌ పూర్తి‌కాగా, మిగి‌లిన సీట్లను ఈ రెండో‌వి‌డత (తు‌ది‌వి‌డ‌త)లో భర్తీ చేయ‌ను‌న్నారు. ఈ నెల 6 నుంచి కౌన్సె‌లింగ్‌ ప్రారంభంకానుంది. 20 నుంచి స్పెషల్‌ రౌండ్‌ కౌన్సె‌లింగ్‌ మొద‌లు‌కా‌ను‌న్నది. ఎంసెట్‌ తొలి‌వి‌డత సీట్ల రద్దు గడు‌వును ఈ నెల ఐదో‌తేదీ వరకు పొడి‌గిం‌చారు.
 
ఇంజి‌నీ‌రింగ్‌, బీ ఫార్మసీ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 25న స్పాట్‌ అడ్మి‌షన్లు నిర్వ‌హిం‌చ‌ను‌న్నారు. మూడు‌ వి‌డ‌తల్లో భర్తీ‌కాని సీట్లను స్పాట్‌ ద్వారా యాజ‌మా‌న్యాలే భర్తీ చేసు‌కొనే అవ‌కాశం కల్పిం‌చారు. ఇందుకు సంబం‌ధిం‌చిన మార్గ‌ద‌ర్శ‌కా‌లను tseamcet.nic.in వెబ్‌‌సై‌ట్‌లో పెట్టారు.