1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 మార్చి 2022 (21:32 IST)

ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే సిటీ బస్సుల్లో ఫ్రీ జర్నీ

హైదరాబాద్ నగరం నుంచి 250 కిలోమీటర్లు పైగా ప్రయాణం చేసేందుకు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే సిటీ బస్సుల్లో ఉచితంగా జర్నీ చేయవచ్చునని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు. 
 
ముందస్తు రిజర్వేషన్‌ టికెట్‌ చూపించి సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని సూచించారు. ఈ విషయాన్ని ఆయన బుధవారం ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. 
 
హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల నుంచి 250 కిలోమీటర్లకు పైగా దూరాలకు ప్రయాణించే వారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుందని సజ్జనార్ వెల్లడించారు. ప్రయాణానికి ముందు 2 గంటలు, తర్వాత 2 గంటల పాటు ఈ సదుపాయం ఉంటుంది.