బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2022 (09:55 IST)

అయ్యప్ప భక్తుల కోసం శుభవార్త.. శబరిమలకు ప్రత్యేక రైళ్లు

train
అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి కొల్లాం, కొట్టాయంలకు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు తెలిపింది. ఈ నెల 20వ తేదీ నుంచి జనవరి 17వ తేదీ వరకు ఈ రైళ్ళను నడుపుతామని పేర్కొంది. ఇవి కాచిగూడ, నల్గొండ, కాజీపేట మార్గంలో ప్రయాణిస్తాయని తెలిపింది. అయ్యప్ప భక్తుల కోసమే ఏకంగా 26 ప్రత్యేక రైళ్లను నడుపనుంది. 
 
ఈ నెల 20, డిసెంబరు 4, 18, జనవరి 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ నుంచి కొల్లంకు ప్రత్యేక రైలు బయలుదేరి వెళుతుంది. ఇది తర్వాత రోజు రాత్రి 11 గంటలకు కొల్లంకు చేరుకుంటుంది. కాచిగూడ, పాలమూరు, గద్వాల మీదుగా వెళుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు నవంబరు 22, డిసెంబరు 6, 20, జనవరి 10 తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటలకు కొల్లంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.05 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. 
 
అలాగే, నవంబరు 27, డిసెంబరు 11, 25, జనవరి 1, 15 తేదీల్లో మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి కొల్లంకు మరో రైలు బయలుదేరి మరుసటి రోజు రాత్రి కొల్లంకు చేరుకుంటుంది. ఇది కాజీపేట, ఖమ్మం స్టేషన్ల మీదుగా వెళుతుంది. తిరుగు ప్రయాణంలో కొల్లం నుంచి సికింద్రాబాద్‌కు నవంబరు 29, డిసెంబరు 13, 27, జనవరి 3, 17 తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు బయలుదేరి తర్వాత రోజు రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది.
 
అదేవిధంగా నవంబరు 21, 28 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి కొల్లంకు మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రైలు రాత్రి 11.50 గంటలకు కొల్లంకు చేరుకుంది. కొల్లం నుంచి సికింద్రాబాద్‌కు నవంబరు 23, 30 తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లంలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది. 
 
ఇకపోతే, సికింద్రాబాద్ - కొట్టాయం ప్రాంతాల మధ్య నవంబరు 20, 27 తేదీల్లో సాయంత్రం 6.50 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9 గంటలకు కొట్టాయంకు చేరుకుంది. ఈ రైలు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్ల మీదుగా వెళుతుంది. 
 
తిరుగు ప్రయాణంలో కొట్టాయం నుంచి సికింద్రాబాద్‌కు నవంబరు 21, 28 తేదీల్ల సోమవారం రాత్రి 11.20 గంటలకు బయలుదేరి బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు కొట్టాయంకు చేరుకుంది.