సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Srinivas
Last Modified: గురువారం, 21 జూన్ 2018 (10:12 IST)

పసుపు తాడు కట్టాడు... ఫేస్ బుక్‌లో పెట్టాడు... ఉరి వేసుకుంది... ఎందుకు?

హైదరాబద్‌లోని మియాపూర్‌లో దారుణం జరిగింది. మైనర్‌ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న ఓ యువకుడు ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశాడు. అవమానం భరించలేక ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబద్‌లోని మియాపూర్‌లో దారుణం జరిగింది. మైనర్‌ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న ఓ యువకుడు ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశాడు. అవమానం భరించలేక ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. 
 
హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీలో తన తల్లితో కలిసి నివాసం ఉంటున్న భవాని.. ఓ అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తోంది. వీరికి బంధువయ్యే బాబు అనే యువకుడు ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ చాలా రోజులుగా వేధించేవాడు. ఆమె సున్నితంగా తిరస్కరించేది. 
 
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భవానిని బాబు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఎంత ప్రతిఘటించినా లాభంలేకపోయింది. మెడలో పసుపు తాడు కట్టేశాడు. ఆ వెంటనే ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశాడు. వాట్సాప్‌లో అందరికీ షేర్‌ చేశాడు. దీనిని తట్టుకోలేకపోయిన భవాని.. ఆత్మహత్య చేసుకుంది. భవాని తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.