బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2023 (13:17 IST)

రంగారెడ్డి జిల్లాలో పీవీఎన్ఆర్ వ్యాన్‌ బీభత్సం

car accident
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌ పరిధిలో పివీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌ వేపై ఓ వ్యాన్‌ బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వెళ్తున్న వ్యాన్‌ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. దీంతో వెనుక నుంచి వచ్చిన కార్లు వ్యానును ఢీకొన్నాయి. 
 
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు కార్లు ఒకదానినొకటి ఢీకొట్టుకున్నాయి. దాంతో.. పివీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌ వేపై భారీగా ట్రాఫిక్‌ ఏర్పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.