గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

కాంగ్రెస్ పార్టీలో చేరిన నటి దివ్యవాణి - హస్తంలో పెరుగుతున్న జోష్

divyavani
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం తథ్యమనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో ఇతర పార్టీలకు చెందిన నేతలు ఆ పార్టీలో చేరేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. తాజాగా సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 
 
బుధవారం ఉదయం ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణిక్ ఠాక్రే సమక్షంలో ఆమె హస్తం పార్టీలో చేరారు. ఎన్నికలకు ముందు పలువురు సినీ సెలెబ్రిటీలు, ఇతర పార్టీలకు చెందిన నేతలు తమ పార్టీలో చేరుతుండటంతో ఆ పార్టీ నేతల్లో జోష్ పెరుగుతోంది. ముఖ్యంగా, గతంలో టీడీపీలో మంచి గ్లామర్ మహిళా నేతగా ఉన్న దివ్యవాణి.. ఇపుడు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో హస్తం శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత నటి దివ్యవాణి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. ప్రజల కోసం ఆలోచించే ఏకాక పార్టీ కాంగ్రెస్ అని, అందుకే ఆ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. తనకు పదవి ఇచ్చినా, ఇవ్వకపోయినా ఎలాంటి బాధ్యత ఇచ్చినా నిజాయితీగా, సక్రమంగా నిర్వహించి పార్టీ విజయం కోసం కృషి చేస్తానని దివ్యవాణి తెలిపారు.