సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: బుధవారం, 30 ఆగస్టు 2017 (21:08 IST)

టి. సీఎం కేసీఆర్‌ను యాంకర్ ఉదయభాను ఎందుకు కలిసినట్లు?

పరిచయాలు పెంచుకోండి... పరిచయాలు పెంచుకోండి... అనే డైలాగ్ మనకు రజినీకాంత్ సినిమా శివాజీ చిత్రంలో విన్నాం. పరిచయాలు పెంచుకుని అలా ముందుకు వెళుతుంటే ఆ పరిచయాలు ఎప్పుడైనా పనికిరావచ్చు. అది చాలామంది అనుసరించే పాలసీ. సందర్భాన్ని చూసుకుని చక్కగా పరిచయం పెంచ

పరిచయాలు పెంచుకోండి... పరిచయాలు పెంచుకోండి... అనే డైలాగ్ మనకు రజినీకాంత్ సినిమా శివాజీ చిత్రంలో విన్నాం. పరిచయాలు పెంచుకుని అలా ముందుకు వెళుతుంటే ఆ పరిచయాలు ఎప్పుడైనా పనికిరావచ్చు. అది చాలామంది అనుసరించే పాలసీ. సందర్భాన్ని చూసుకుని చక్కగా పరిచయం పెంచుకుంటూ వుంటారు. అది ఎప్పటికైనా ఉపయోగపడవచ్చు. ఇంతకీ ఈ పరిచయాల గొడవ ఏంటయా అంటే... యాంకర్ ఉదయభాను తెలంగాణ ముఖ్యమంత్రిని కలిశారు. దాని గురించి...
 
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో బుల్లితెర నటి ఉదయ‌భాను కలిసి తమ పిల్లల జన్మదిన వేడుకలకు ఆయనను ఆహ్వానించినట్లు సమాచారం. ఉదయభాను దంపతుల విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఉదయభానుకు కవలపిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే. వారి మొదటి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రిని కేసీఆర్‌ను ఆహ్వానించినట్లు సమాచారం.