శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2022 (09:02 IST)

కేపీహెచ్‌బీలో వ్యభిచార ముఠా... పోలీసుల మెరుపుదాడి

prostitute
హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీలో ఓ ఇంటిలో వ్యభిచారం గుట్టుగా సాగుతోంది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో వ్యభిచారం చేస్తున్న ఓ విటుడు, యువతి, అందులో పని చేసే మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గృహం నిర్వాహకులు మాత్రం పత్తాలేకుండా పారిపోయారు. 
 
కేపీహెచ్‌బీ కాలనీలోని రోడ్ నంబరు 2, 3 మధ్యనున్న ఓ ఇంట్లో జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఇంటిపై పోలీసులు మెరుపుదాడి చేసి మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వీరిని కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న వ్యభిచార గృహం నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు.