బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కోర్టు బెయిల్
హైదరాబాద్ నగరంలోని గోషామహాల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బీజేపీకి చెందిన రాజాసింగ్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల రాజాసింగ్‌ను పీడీయాక్ట్ కింద అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఆయన బెయిల్ కోసం కింది కోర్టులను ఆశ్రయించగా, నిరాశ ఎదురైంది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడ ఆయన అనుకూలంగా తీర్పు వచ్చింది షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
ఇకపై ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని రాజాసింగ్‌కు కోర్టు సూచించింది. మతాలను కించపరిచే వ్యాఖ్యలు కూడా చేయొద్దని, మీడియాతో మాట్లాడరాదని, ర్యాలీలు చేపట్టరాదని ఇలా పలు షరతులు విధించింది. అంతేకాకుండా, తక్షణమే రాజాసింగ్‌ను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.
పీడీయాక్ట్ కింద రాజా సింగ్‌ను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేయగా, ఆయన గత 40 రోజులుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. చివరకు పలు మార్లు న్యాయపోరాటం తర్వాత ఆయనకు బెయిల్ దక్కింది.