ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 2 మే 2020 (16:16 IST)

క్యాన్సర్ హాస్పిటల్ ను పరిశీలించిన బాలకృష్ణ

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో కోవెడ్ సందర్భంగా తీసుకొంటున్న పలు చర్యలను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పరిశీలించారు.

ముఖ్యంగా హాస్పిటల్ కు వచ్చే పెషెంట్లను భవనంలోనికి ప్రవేశించడానికి ముందుగా స్క్రీనింగ్ చేయడానికి చేసిన బృందాలను అడిగి వివరాలు తెలుసుకొన్నారు.

అనంతరం హాస్పిటల్ లోనికి ప్రవేశించే వారికోసం ఏర్పాటు చేసిన శానిటైజేషన్ సౌకర్యాలు అటు పిమ్మట సిబ్బంది తీసుకొంటున్న చర్యలను వాకబు చేశారు.

అలానే పేషెంట్ తో పాటూ వచ్చిన వారు వేచి ఉండడానికి చేసిన ఏర్పాట్లపై చర్చించారు. పలువురు పేషెంట్లను పరామర్శించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.

ఈ సమావశంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ సీఈవో, డా. ఆర్ వి ప్రభాకర రావు మరియు మెడికల్ డైరెక్టర్ డా. టియస్ రావులు కోవిడ్ సందర్భంగా తీసుకొంటున్న పలు జాగ్రత్తలను వివరించారు.