గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 14 డిశెంబరు 2018 (11:19 IST)

బస్సును 80 కి.మీ వేగంతో నడుపుతూ సెల్ ఫోన్ టాక్... (Video)

గురువారం సాయంత్రం నాలుగు గంటల 40 నిమిషాలకు నారాయణపేట ఆర్టీసీ డిపోకు చెందిన TS 06 UA 9059 ఆర్టిసి బస్సు నారాయణపేట నుంచి హైదరాబాద్ వస్తుంది. షాద్ నగర్ బైపాస్ వద్ద ఆర్టీసీ డ్రైవర్ సుమారు ఐదు నిమిషాలు సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసాడు. ఆ సమయంలో బస్సు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 
 
బస్సులో 65 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇటీవలే ఉప్పల్ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడుతూ బైకున ఢీ కొట్టాడు. ఈ ఘటనలో వారం రోజుల్లో పెళ్లి జరగాల్సిన యువ జంట దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయినా ఆర్టీసీ డ్రైవర్‌లో మార్పు రాకపోవడం గమనార్హం. చూడండి వీడియో...