శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (12:30 IST)

తెలంగాణలో నేడు 74 లక్షలకు పైగా ఖాతాలకు రూ.1500 చొప్పున నగదు బదిలీ

కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ తో నిరుపేదలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అలాంటివారికి కొద్దిమేర ఊరట కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం నగదు బదిలీ చేయాలని నిర్ణయించింది.

నేడు 74 లక్షలకు పైగా బ్యాంకు ఖాతాలకు రూ.1500 చొప్పున నగదు బదిలీ చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. లాక్ డౌన్ కారణంగా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించిన మేర ఈ ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు.

అందుకోసం మొత్తం రూ.1,112 కోట్లు కేటాయిస్తున్నట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి ఆయా బ్యాంకులకు బదిలీ చేశామని తెలిపారు. 

''కరోనా సమయంలో పేద ప్రజలకు మద్దతుగా సీఎం కేసీఆర్ వాగ్దానం చేసినట్లు... తెలంగాణలో సుమారు 74 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో నేడు రూ.1500 జమకానున్నాయి. ఇందుకోసం రూ. 1,112 కోట్లు ప్రభుత్వం బ్యాంకులకు బదిలీ చేసింది" అని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.