శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 1 జనవరి 2021 (19:48 IST)

మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షల వెల్లువ

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ప్రగతి భవన్ లో ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ పూర్ణ చందర్ రావు కేటీఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం తెలంగాణ భవన్ లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా తనను కలిసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలకు సరికొత్త ఉత్సాహాన్ని అందించాలని, రాష్ట్రం అభివృద్ధిలో మరింతగా పురోగమించాలని కేటీఆర్ ఆకాంక్షించారు.