గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఫిబ్రవరి 2022 (16:24 IST)

సీఎం కేసీఆర్ మీద దేశద్రోహం కేసు పెట్టాలి.. రేవంత్ రెడ్డి

భార‌త రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్‌ వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 
 
కేసీఆర్‌పై పోలీసుల‌కు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంపై సీఎం వ్యాఖ్యలపై అభ్యంత‌రమ‌ని  గజ్వేల్ పోలీస్ స్టేషన్ సీఎం కేసీఆర్‌పై ఫిర్యాదు చేశారు. ఇప్పుడున్న భారత రాజ్యాంగంతో గడిచిన 75 సంత్సరాలలో ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరడం లేదన్న‌ సీఎం కేసీఆర్ కామెంట్స్‌ను పోలీసుల‌కు వివ‌రించారు.
 
రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్తగా రాజ్యాంగం రాయలని కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు దేశద్రోహం కిందకు వస్తాయ‌ని, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద దేశద్రోహం కేసు పెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే కేసీఆర్  ఫ్యామిలీ రాజ్యాంగ బద్ధంగా పదవులు అనుభవిస్తోందని గుర్తు చేశారు.