బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 మే 2021 (09:25 IST)

తెలంగాణాలో వైద్య సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణా రాష్ట్రంలో వైద్య సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఇందులోభాగంగా, డాక్టర్లు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు తదితర వైద్యారోగ్య సిబ్బంది భర్తీకి సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
 
ఇప్పుడున్న వైద్య సిబ్బందిపై భారం తగ్గించటం, రోగులకు మెరుగైన సేవలందించాలన్న ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం పెద్దసంఖ్యలో సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 
 
రిటైర్డ్‌ మెడికల్‌ ఆఫీసర్లు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తులకు ఈ నెల 22 చివరి తేదీగా ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు health.telan gana.gov.in లింక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
 
ఈ పోస్టులకు ఎంపికయ్యే మెడికల్‌ ఆఫీసర్ స్పెషలిస్ట్‌ పోస్టుకు రూ.లక్ష వేతనం ఇస్తారు. అలాగే, మెడికల్‌ ఆఫీసర్ ‌- ఎంబీబీఎస్‌ రూ.40 వేలు, మెడికల్‌ ఆఫీసర్‌- ఆయుష్‌ రూ.35 వేలు, స్టాఫ్‌ నర్స్‌ రూ.23 వేలు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ రూ.17 వేలు చొప్పున వేతనంగా అందజేయనున్నారు.