బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 సెప్టెంబరు 2021 (15:44 IST)

గూడ్సు రైలు పట్టాలు తప్పింది..

గూడ్సు రైలు పట్టాలు తప్పింది. విజయవాడ నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న గూడ్సు రైలు డోర్నకల్‌ వద్ద పట్టాలు తప్పడంతో రెండు వ్యాగన్లు పట్టాలపై నుంచి పక్కకు జరిగాయి. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
వర్షం కురుస్తున్నప్పటికీ వ్యాగన్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. మహబూబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో జిల్లా పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.