శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 21 జూన్ 2021 (08:50 IST)

23వ తేదీ నుంచి దుబాయ్ విమాన సర్వీసులు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత్‌తో తమ విమాన సర్వీసులను పునరుద్ధరించబోతోన్నట్లు ప్రకటించింది. ఈ నెల 23వ తేదీ నుంచి భారత్ నుంచి తమ దేశానికి విమానాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. నిజానికి యూఏఈ తీసుకున్న నిర్ణయం ప్రకారం విమాన సర్వీసులపై నిషేధం జులై 6వ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది.
 
కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో షరతులతో కూడిన ప్రయాణానికి అనుమతి ఇచ్చింది. తమ దేశానికి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంస్థ.. భారత్‌లోని అన్ని ప్రధాన నగరాల నుంచి విమానాలను నడిపించనున్నట్లు దుబాయ్ సుప్రీం కమిటీ ఆఫ్ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఆరంభం కావడానికి ముందు నాటి పరిస్థితులకు అనుగుణంగా విమాన సర్వీసులు ఉంటాయని హామీ ఇచ్చింది ఎమిరేట్స్.
 
వ్యాలిడ్ రెసిడెన్స్ విసా ఉండి, యూఏఈ అప్రూవ్ చేసిన వ్యాక్సిన్ల రెండు డోసులను తీసుకున్న ప్రయాణికులకు తాము అనుమతి ఇస్తామని పేర్కొంది. అలాగే- ప్రయాణికులు 48 గంటలు ముందుగా తీసుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను అందజేయాల్సి ఉంటుందని తెలిపింది.