మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (14:19 IST)

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫేస్‌బుక్ ఖాతాపై నిషేధం

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్య‌క్తిగ‌త ఖాతాపై ఫేస్‌బుక్ నిషేధం విధించింది. ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వ్య‌క్తిగ‌త ఖాతాల‌ను తొల‌గించారు. ద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో రాజాసింగ్‌ ఫేస్‌బుక్ నియమాలను పాటించ‌లేద‌ని ఫేస్‌బుక్ యాజ‌మాన్యం తెలిపింది.
 
హింస‌ను ప్రేరేపించే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి త‌మ‌ నియమావళిని ఎమ్మెల్యే ఉల్లంఘించారు అని ఫేస్‌బుక్ ప్ర‌తినిధి పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖాతాపై నిషేధం విధించామ‌ని స్ప‌ష్టం చేశారు. 
 
కాగా, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కావడం గమనార్హం. దీనిపై ఫేస్ బుక్ స్పందిస్తూ... ఎవరైనా ద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని తమ నిబంధనలు ఒప్పుకోవని తెలిపింది. హింసను ప్రేరేపించే వ్యాఖ్యలకు సంబంధించి తమ నిబంధనలను రాజాసింగ్ ఉల్లంఘించారని చెప్పింది. 
 
ఈ కారణం వల్లే రాజాసింగ్ పై నిషేధం విధించామని తెలిపింది. మరోవైపు వారం క్రితమే రాజాసింగ్ ఓ వివరణ ఇచ్చారు. తనకు ఫేస్‌బుక్ పేజ్ లేదని... తన పేరు మీదుగా అనేక మంది ఫేస్‌బుక్ పేజీని నడుపుతున్నారని చెప్పారు. ఫేస్‌బుక్‌లో తన పేరు మీద వచ్చే ఏ పోస్టుకూ తాను బాధ్యుడిని కాదని ఆయన చెప్పారు.