Daily Horoscope
✕

వేములవాడ ఆలయం వద్ద అగ్నిప్రమాదం

Written By సెల్వి
Updated: శనివారం, 9 సెప్టెంబరు 2023 (17:09 IST)
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ ఆలయం వద్ద అగ్నిప్రమాదం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని  ఈ ఆలయ సమీపంలోని వసతి గృహాల్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ ఎండబెట్టిన కొబ్బరి చిప్పల నుంచి పొగ రావడం భక్తులు గమనించారు. 
 
ఆ పొగ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకునేలోపే మంటలు చెలరేగాయి. దాంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది.. స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
 
ప్రస్తుతం వేములవాడలో జాతర జరుగుతోంది. దాంతో జాతరకు భక్తులు వేలాదిగా హాజరయ్యారు. మంటలు చెలరేగడంతో భక్తులు, అధికారులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికి ఎటువంటి హానీ జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

అన్నీ చూడండి

Meenakshi Chaudhary: లక్కీ భాస్కర్ తర్వాత మదర్ రోల్స్ ఆఫర్ చేశారు : హీరోయిన్ మీనాక్షి చౌదరి

జానీ మాస్టర్ భార్య సుమలత వర్సెస్ ఫిలిం ఫెడరేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్.. క్షమాపణలు

జనవరిలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సీజన్-2

Deepti Ganta : ప్రొడక్షన్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని డైరెక్షన్ చేయాలి.: దీప్తి గంటా

Rushum: విరాట్ హీరోగా చిరంజీవి నటించిన రుస్తుం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments