శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 జనవరి 2023 (11:49 IST)

భద్రాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ కోసం వెళ్తూ..

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కోటి లింగాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇల్లెందు- మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో కారు, లారీ ఢీకొన్నాయి. 
 
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణీస్తున్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ కోసం భద్రాద్రి జిల్లా మోతె ప్రాంతానికి వెళ్తున్నట్లు తెలుస్తుంది. 
 
ప్రమాదానికి ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. 
 
కారు డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు దవాఖానకు తీసుకెళ్తుండగా మరణించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.