1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 మార్చి 2023 (13:00 IST)

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి... రక్తస్రావం.. శస్త్రచికిత్స.. విషమంగా..

శంషాబాద్‌లో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. వివరాల్లోకి వెళితే. బెంగళూరు నుంచి ఉపాధి నిమిత్తం హైదరాబాదుకు వచ్చిన ఓ కుటుంబం శంషాబాద్ ఫ్లై ఓర్ లేబర్ క్యాంప్‌లో నివాసం వుంటోంది. 
 
వీరికి నాలుగేళ్ల చిన్నారి వుంది. అయితే పనుల నిమిత్తం తల్లిదండ్రులు నిమగ్నమై ఉండటం చిన్నారి బయట ఆడుకుంటూ వుండటం గమనించిన ఓ యువకుడు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ చిన్నారి నొప్పికి తట్టుకోలేక ఏడవటం చూసిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెకు శస్త్రచికిత్స చేశారు. 
 
పాప పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు వెంకటయ్యను అరెస్ట్‌ చేశారు.