1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జులై 2022 (11:49 IST)

గోదావరికి రికార్డు స్థాయిలో వరద - పోలవరం గేట్లన్నీ ఎత్తివేత

తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గత వందేళ్ళ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో గోదావరి నదికి వరద వచ్చింది. దీంతో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో ప్రాజెక్టుకు అమర్చిన 48 గేట్లను ఎత్తివేశారు. ఈ గేట్ల ద్వారా 9 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 
 
సోమవారం మధ్యాహ్నానికి 12 లక్షల క్యూసెక్కుల నీటి వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరిలో గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతూనే ఉంది. వరద ఉధృతి కారణంగా పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం 32.2 మీటర్లకు చేరుకుంమది. గంటకు 35 సెంటీమీటర్ల చొప్పున గోదావరి నీటిమట్టం పెరుగుతుండటం గమనార్హం.