గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 జులై 2022 (10:53 IST)

ధోనీకి బర్త్ డే నేడు.. 41 అడుగుల కటౌట్‌.. ఎక్కడంటే? (video)

dhoni
dhoni
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బర్త్ డే నేడు. మహీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ధోనీ గ్రౌండ్‌లోకి దిగితే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. సోషల్ మీడియాలో ధోనీకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  
 
జూలై 7 గురువారం ధోనీ బర్త్ డే కావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ జిల్లా నందిగామ సమీపంలోని అంబారుపేట వద్ద అభిమానులు భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. 
 
ధోనీ 41వ జన్మదినం సందర్భంగా 41 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. అది కూడా వన్డే వరల్డ్ కప్‌లో విన్నింగ్ షాట్ కొడుతున్న స్టిల్‌తో కటౌట్ రూపొందించారు. 41అడుగుల కటౌట్‌తో పాటు 41 కేజీల కేక్ కట్ చేసేందుకు అభిమానులు సిద్ధమయ్యారు.
 
తాజాగా విజయవాడ అంటేనే ఏ వేడుకకైనా ఫ్లెక్సీలు కట్టేస్తారు. మహీకి ఏకంగా కటౌట్ కట్టి అభిమానాన్ని చాటుకున్నారు అంబారుపేట యువకులు. ధోనీ కటౌట్‌ను నేషనల్ హైవే పక్కన ఏర్పాటు చేయడంతో వాహనదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 
 
అంబారుపేట గ్రామానికి చెందిన భువన్ చారీ, భారత్, సాయి, సిద్ధు, బెనాకర్ సహా మరికొందరు అభిమానులు కలిసి ఈ కటౌట్ ఏర్పాటు చేశారు.