1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 జులై 2022 (10:39 IST)

భీమవరంలో చిరంజీవి - ఘన స్వాగతం పలికిన మెగా ఫ్యాన్స్

chiranjeevi
ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు సోమవారం వచ్చారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ఆయన పాల్గొననున్నారు. భీమవరం చేరుకున్న చిరంజీవికి అభిమానులు గజమాలతో ఘనస్వాగతం పలికారు. వాహనం ముందుకు భారీగా చేరుకుని 'జై చిరంజీవ' అంటూ నినాదాలు చేశారు. 
 
మరోవైపు, భీమవరం పర్యటనకు వచ్చే ప్రధాని మోడీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కలిసి పాల్గొంటున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకునే మోడీకి జగన్ స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి వారిద్దరూ భీమవరంకు హెలికాఫ్టరులో బయలుదేరి వెళతారు. 
 
ఆ తర్వాత వెస్ట్ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరావు కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 12.25 గంటలకు భీమవరం నుంచి తిరుగు పయనమవుతారు. మధ్యాహ్నం 1.05 గంటలకు గన్నవరం విమానాశ్రయంకు చేరుకుని ప్రధాని మోడీకి వీడ్కోలు పలుకుతారు. ఆ తర్వాత సీఎం జగన్ తన తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకుంటారు.