కరోనాను కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్: ఎమ్మెల్యే సీతక్క
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లోని కోవిడ్ వార్డును ఎమ్మెల్యే సితక్క పరిశీలించారు. అక్కడ రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్బంగా చికిత్స కోసం వచ్చిన వాళ్ళు తమ బాధలను ఎమ్మెల్యేకు చెప్పుకున్నారు. గంటలకొద్దీ.. క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుందని, కనీసం త్రాగేందుకు నీళ్లు కూడా లేవని సీతక్క ముందు
వాపోయారు.
ఉత్తర తెలంగాణలో ఉన్న జిల్లాల్లో పేద ప్రజలకు పెద్ద దిక్కు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్. వసతుల కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు ఎమ్మెల్యే సితక్క. కరోనా పరీక్షల కోసం వస్తున్న ప్రజలు గంటలకొద్దీ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఉంది, దాంట్లో కరోనా పేషెంట్లు కూడా ఉండొచ్చు. వాళ్ళు ఇమ్యూనిటీ కోల్పోయే ప్రమాదం ఉంది.
ఇంకా వేరే వాళ్లకి కూడా వ్యాధి సోకే ప్రమాదం ఉంది, తక్షణమే ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే. ప్రభుత్వం సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు, వైద్యులకు సరిపడే సామాగ్రి అందించాలి అని డిమాండ్ చేశారు. ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వం భరోసాని కల్పించాలనీ, ప్రభుత్వం ఇలా చేతులు ముడుచుకుని కూర్చోవడం ఏంటి? తగిన చర్యలు తీసుకోవాలని అని మండిపడ్డారు.