ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

jurala project
ఠాగూర్| Last Updated: బుధవారం, 21 జులై 2021 (12:58 IST)
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని అనేక జలాశయాలు నీటి కళతో తొణికిసలాడుతున్నాయి. అలాంటి వాటిలో జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఒకటి. ఇది ఇపుడు జలకళను సంతరించుకుంది.

ఎగువన కురుస్తున్న వర్షాలకు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సుమారు 87 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ వరద నీరు మరింతగా వచ్చే అవకాశం ఉండటంతో గేట్లను ఎత్తి 1,10,556 క్యూసెక్కులు నదిలోకి (శ్రీశైలం వైపు) విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు (318.516 మీటర్లు) కాగా ప్రస్తుతం 6.38 టీఎంలు (316.790 మీటర్లు)గా ఉంది.దీనిపై మరింత చదవండి :