గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (18:55 IST)

గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత: సొమ్మసిల్లి పడిపోయిన సునీతారావ్‌

congress
congress
గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. నిరసన తెలుపుతున్న సమయంలో కొంతమంది మహిళా కాంగ్రెస్ నేతలు గాయపడ్డారు.
 
మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. 
 
మహిళా కాంగ్రెస్ చైర్మన్ సునీతారావ్.. సొమ్మసిల్లి కిందపడిపోయారు. ఆమెకు స్వల్ప గాయాలవడంతో కేర్ హాస్పిటల్‌కు తరలించారు. మహిళా కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు.