సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (10:56 IST)

కర్మ‌న్ ఘాట్‌లో ఉద్రిక్తత.. కారణం ఏంటంటే?

కర్మ‌న్ ఘాట్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దుండ‌గులు గోవుల‌ను అక్ర‌మంగా బులెరో వాహ‌నంలో త‌ర‌లిస్తున్నార‌ని తెలుసుకున్న గౌ ర‌క్ష‌క్ స‌భ్యులు ఆ వాహ‌నాన్ని క‌ర్మ‌న్ ఘాట్ వ‌ద్ద అడ్డుకున్నారు. దీంతో ఆగ్ర‌హించిన దుండ‌గులు ఇన్నోవో వాహ‌నాన్ని వెనుక నుంచి ఢీకొట్టారు. 
 
క‌త్తుల‌తో దాడులకు దిగారు. దీంతో గౌ ర‌క్ష‌క్ స‌భ్యులు ద‌గ్గ‌ర‌లో ఉన్న ఆంజ‌నేయ దేవాల‌యంలోకి ప‌రుగులు తీశారు. ఆల‌యంలోకి ప్ర‌వేశించి క‌త్తుల‌తో గౌ ర‌క్ష‌క్ స‌భ్యుల‌పై దాడులు చేశారు. 
 
విష‌యం తెలుసుకున్న హిందూసంఘాలు, భ‌జ‌రంగ్ దళ్ కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో క‌ర్మ‌న్‌ఘాట్‌కు చేరుకొని రోడ్డుపై భైటాయించారు. 
 
దుండ‌గుల‌ను అదుపులోకి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. పోలీసులు అక్క‌డికి చేరుకొని లాఠీచార్జ్ చేయ‌డంతో ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మారింది.