మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (08:48 IST)

ఆ పని చేస్తే రాష్ట్రపతి అభ్యర్థిగా నితీశ్ : ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్

భారతీయ జనతా పార్టీ ఉన్న స్నేహబంంధాన్ని తెగదెంపులు చేసుకుంటే రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ పేరును ప్రకటిస్తామని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అయితే, బీజేపీతో సంబంధాలు తెంచుకుంటే మాత్రం రాష్ట్రపతి అభ్యర్థిగా నితీశ్ కుమార్ పేరును ప్రకటించాలా వద్దా అనే అంశంపై చర్చిస్తామన్నారు. 
 
ఇదిలావుంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. కానీ, రెండో స్థానంలో నిలిచిన జేడీయుకే అధికార పగ్గాలను బీజేపీ అప్పగించింది. ఫలితంగా ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ కొనసాగుతున్నారు. ఇదిలావుంటే, నితీశ్ బీజేపీపై బహిరంగంగానే విమర్శలు చేస్తుండటంతో బీజేపీతో ఆయనకు చెడిందన్న ఊహాగానాలు బయటకు వచ్చాయి. ఇపుడు ప్రశాంతి కిషోర్‌తో భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది.