గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 17 జూన్ 2020 (10:13 IST)

స్వార్థం కోసం యాగాలు చేసేవారిని హిందూ సమాజం గుర్తించదు: బండి సంజయ్‌

తన కుమారుడిని సీఎం చేయడానికి, స్వార్థం కోసం యాగాలు చేసేవారిని హిందూ సమాజం హిందువుగా గుర్తించదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పరోక్షంగా సీఎం కేసీఆర్ ను ఎద్దేవా చేశారు.

నిఖార్సయిన హిందువునని సీఎం ప్రకటించుకుంటారని పేర్కొంటూ, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తేనే హిందువుగా సమాజం గుర్తిస్తుందని వ్యాఖ్యానించారు.

ఈ నెల 21న ప్రపంచ దేశాలు యోగా దినోత్సవంగా పాటిస్తున్నాయని, అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కేసీఆర్‌ కూడా పాల్గొంటే ప్రజల్లోకి మంచి సందేశం వెళుతుందన్నారు.

యోగా మతపరమైనది కాదని స్పష్టం చేశారు. ఎవరి మెప్పు కోసమో కేసీఆర్‌.. యోగా దినోత్సవంలో పాల్గొనడం లేదన్నారు.