1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2023 (11:57 IST)

బాచుపల్లిలో గుంతల రోడ్లు.. బైకుపై తండ్రితో వెళ్లిన చిన్నారి మృతి

road accident
హైదరాబాద్ గుంతలతో కూడిన రోడ్డు ఓ చిన్నారిని బలితీసుకుంది. హైదరాబాద్‌లో బుధవారం తెల్లవారుజామున బాచుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై తండ్రితో కలిసి పాఠశాలకు వెళ్తున్న రెండో తరగతి విద్యార్థిని మృతి చెందింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. 
 
బురదమయమైన రోడ్డు గుండా తండ్రి జాగ్రత్తగా వెళ్తుండగా, బైక్ రెడ్డీస్ ల్యాబ్ సమీపంలోని గుంతలోకి బైకు దిగిపోయింది. దీంతో చిన్నారి బైకు నుంచి కింద పడిపోయింది. అంతేగాకుండా బైకు వెనుక వున్న పాఠశాల బస్సు చిన్నారిపైకి దూసుకెళ్లింది, ఫలితంగా తీవ్ర గాయాలతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.