మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (19:35 IST)

హీరో నిఖిల్‌కు హైదరాబాద్ పోలీసుల అపరాధం

టాలీవుడ్ యువ హీరో నిఖిల్ హైదరాబాద్ పోలీసుల చేతికి చిక్కారు. లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేసినందుకుగాను ఆయనకు పోలీసులు అపరాధ చలానా పంపించారు. 
 
తన కాను నంబరు ప్లేటు నిబంధనల ప్రకారం లేదని మరో చాలానాను పంపారు. అయితే, నిబంధనల ఉల్లంఘన సమయంలో నటుడు నిఖిల్ కారులో లేరని పోలీసులు ధ్రువీకరించారు. 
 
కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం లాక్డౌన్ అమల్లో ఉంది. కరోనా వైరస్ కేసులకు కట్టడి వేసేందుకు విధించిన లాక్డౌన్‌ను ప్రభుత్వం ఇప్పటివరకు రెండుసార్లు పొడిగించింది. తాజాగా విధించిన లాక్డౌన్ నిబంధనలు ఈ నెల 9 వరకు అమల్లో ఉండనున్నాయి. 
 
అదేసమయంలో ఈ లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. స్వయంగా హైదరాబాద్, సైబరాబాద్, వికారాబాద్ పోలీస్ కమిషనరేట్లకు చెందిన పోలీస్ బాస్‌లో ఎర్రటి ఎండలో వాహనాల తనిఖీల్లో పాల్గొంటున్నారు.