గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 అక్టోబరు 2022 (16:01 IST)

నేను తెలంగాణకు కాబోయే సీఎం.. నన్నే అడ్డుకుంటారా?: కేఏ పాల్

ka paul
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణకు కాబోయే సీఎం అంటూ వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికారులు కేఏ పాల్ వాహనాన్ని అడ్డుకోగా, ఆయన వారిపై చిందులేశారు.
 
దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కేఏ పాల్ "నన్నే ఆపుతారా... ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? నేను తెలంగాణకు కాబోయే సీఎంను... రెస్పెక్ట్ ఇవ్వండి" అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. 
 
అంతేకాదు, ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ తన ఫాలోవర్ అని, తాను అనుమతి తీసుకునే ప్రచారం చేస్తున్నానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో, తనను ఆపిన అధికారిని నీ పేరేంటని ప్రశ్నించారు. ఈ దశలో ఇతర అధికారులు జోక్యం చేసుకుని కేఏ పాల్‌కు సర్దిచెప్పడంతో ఈ వ్యవహారం అంతటితో ముగిసింది.