గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 9 నవంబరు 2019 (20:21 IST)

కల్లు కోసం... కుండపెడితే...!

కల్లు కుండలో నాగుపాము ప్రత్యక్షమైన ఘటన కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణానికి చెందిన పంజాల కొమరయ్య గీత కార్మికుడు.

రోజూలాగే కల్లు తీసేందుకు చెట్టుపై ఉన్న కుండను తీసుకున్నాడు. అదే సమయంలో కుండలో నుంచి బుసలు కొట్టే శబ్దం రావడాన్ని కొమురయ్య గమనించాడు.

కుండను పరిశీలించగా అందులో నాగుపాము ఉన్నట్లు గుర్తించాడు. భయాందోళనకు గురైన కొమరయ్య పక్కనే ఉన్నవారిని పిలిచి పామును కుండలోంచి బయటకు తీశారు.