శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 11 అక్టోబరు 2019 (15:14 IST)

గోవా నుండి ఇండిగో విమానం, బట్టలు విప్పుకుని బాత్రూంలో పడి వున్న వ్యక్తి

గోవా నుండి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో జర్మనీ దేశానికి చెందిన ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. విమానం బాత్రూంలో ఇతను బట్టలు  విప్పుకొని పడి ఉండటం గమనించిన ఇండిగో విమాన సిబ్బంది సిఐఎస్ఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అతడిని సదరు అధికారులు శంషాబాద్ పోలీసులకు అప్పగించారు.
 
అతని శరీరంపై ఎర్రని మచ్చలు ఉండటంతో అతడేమైనా డ్రగ్స్ తీసుకున్నాడా? లేక ఏదైనా వైరస్ సోకిందా? అనే కోణంలో పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతడిని కంట్రోల్ చేయడం కష్టంగా ఉండటంతో ఉస్మానియా ఆస్పత్రికి అంబులెన్సులో తరలించారు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు.