1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (21:46 IST)

చంద్రబాబు అరెస్ట్.. టెక్కీల మద్దతు.. హైదరాబాదులో ఆందోళన

Babu
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్‌లో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు నిలిచారు. చంద్రబాబు అరెస్ట్ అన్యాయమని వేలాది మంది ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలిపిన నిరసనకారులు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు టెక్కీలు ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని భావించారు.
 
తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచినందుకు చంద్రబాబును నిర్బంధించడం పట్ల టెక్కీ విచారం వ్యక్తం చేశారు. "నేను సిబిఎన్‌తో ఉన్నాను" అని రాసి వున్న ప్లకార్డులను చేతపట్టి టెక్కీలో రోడ్డుపై ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి టెక్కీల ఆందోళనను అదుపుచేసేందుకు ప్రయత్నించారు. వారిని చెదరగొట్టారు.