శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 20 జులై 2019 (18:50 IST)

పాపం జబర్దస్త్ వినోద్.. ఇల్లు కొనే ప్రయత్నంలో మోసపోయాడు

జ‌బ‌ర్ద‌స్త్ వినోద్‌పై దాడి జ‌రిగింది. ఇల్లు కొనే ప్రయత్నంలో అతను మోసపోయాడు. వివరాల్లోకి వెళితే... కాచిగూడ‌లోని కుద్బిగూడ‌లో అతను ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. నాలుగు నెల‌ల క్రితం వినోద్ తాను ఉంటున్న 70 గ‌జాల ఇంటిని కొనుగొలు చేసేందుకు య‌జ‌మానికి రూ.10ల‌క్ష‌లు అడ్వాన్స్ ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడు. 
 
అప్ప‌టి నుంచి తాను ఇళ్లును అమ్మ‌న‌ని, ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వ‌నని య‌జ‌మాని గొడ‌వ‌కు దిగాడు. ఈ నేప‌థ్యంలో శ‌నివారం వినోద్ ఇంటి య‌జ‌మానిని నిల‌దీయ‌గా ఇంటి య‌జ‌మానితో పాటు  అత‌ని భార్య, కొడుకులు వినోద్‌పై దాడికి దిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ దాడిలో వినోద్ త‌ల‌కు తీవ్ర‌గాయాలు అయ్యాయి. దాడికి దిగిన వారిపై కాచిగూడ పోలీస్ లు కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేపట్టారు.