1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 27 ఆగస్టు 2014 (12:28 IST)

ఏబీవీపీ కార్యకర్తను... ఇపుడు మెదక్ బీజేపీ అభ్యర్థిని : జగ్గారెడ్డి!

మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా తూర్పు జయప్రకాష్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఆయన బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డి కరుడుగట్టిన సమైక్యవాదిగా ముద్రపడిన విషయం తెల్సిందే. గత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ చీప్ విఫ్‌గా పని చేసిన జగ్గారెడ్డి.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు బీజేపీ మెదక్ లోక్‌సభఉప ఎన్నికల టిక్కెట్‌ను కేటాయించింది. 
 
దీనిపై జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నుంచి అనూహ్యంగా భారతీయ జనతా పార్టీలో చేరలేదన్నారు. తాను మొదట బీజేపీ కార్యకర్తనేనని, ఏబీవీపీ నుంచే క్రీయాశీల కార్యకర్తగా ఎదిగానని చెప్పారు. ఈ సమయంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తప్పక గెలుస్తానని భావిస్తున్నానని తెలిపారు. గెలిస్తే మెదక్ జిల్లాకు అభివృద్ధి పథకాలు తెస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఒప్పించి మెదక్‌లో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తానని ఆయన ప్రకటించారు.