ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 జూన్ 2022 (07:52 IST)

జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో కార్పొరేటర్ కుమారుడే సూత్రధారి!

victim
హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ వద్ద ఓ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన కేసులో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కుమారుడు సాదుద్దీన్ మాలిక్ ప్రధాన సూత్రధారి అని పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 
 
గత నెల 28వ తేదీన అమ్నీషియా పబ్‌కు తన స్నేహితులతో కలిసి వెళ్లిన కార్పొరేటర్‌ కుమారుడు అక్కడ బాధిత బాలికను మాటల్లో పెట్టి తనవైపు ఆకర్షించే ప్రయత్నం చేశాడు. గతంలో ఒకసారి కలిశావంటూ మాటలు కలిపాడు. ఇంటి వద్ద దించుతానంటూ నమ్మించి కారులో ఎక్కించుకున్నాడు. 
 
బంజారాహిల్స్‌లోని కాన్సు బేకరీ వద్దకు వెళ్లిన తర్వాత బాలిక బ్యాగు, కళ్లద్దాలు, సెల్‌ఫోన్‌ బలవంతంగా లాక్కొన్నాడు. ఆ తర్వాత ఆ బాలికను కారులో కూర్చోబెట్టి నిందితులంతా బేకరీలో తమకు కావాల్సిన చిరుతిండ్లు ఆరగించారు. సిగరెట్ తాగారు. 
 
ఆ తర్వాత తమతో కారులో వస్తేనే ఆయా వస్తువులు ఇస్తామంటూ ఆ బాలికను బెదిరించి ఇన్నోవా వాహనంలో తీసుకెళ్లారు. నిర్జన ప్రదేశంలో వరుసగా లైంగిక దాడికి పాల్పడ్డారని కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.