మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 నవంబరు 2021 (20:44 IST)

మేమంతా నటిస్తున్నామా? సుధీర్ బాబుకు కేటీఆర్ కౌంటర్

టాలీవుడ్‌ స్టార్‌ హీరో సుధీర్ బాబు కి తెలంగాణ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఇండియా జాయ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ… కేటీఆర్ మంచి యాక్టర్ అన్నారు సుధీర్ బాబు. సినిమాల్లో నటించేప్పుడు.. మేము క్యారక్టర్ లో పూర్తిగా లీనమైనప్పుడే బాగా చేయగలమని తెలిపారు. అలాగే… కేటీఆర్ కూడా ప్రజల్లో లీనమవుతాడని చెప్పారు. తన పాత్ర కి పూర్తి న్యాయం చేస్తాడు అన్నారు సుధీర్‌ బాబు.
 
అందుకు సమాధానంగా… కేటీఆర్ మాట్లాడుతూ… తాను ఇన్నిరోజులు పొలిటీషియన్ ను అనుకున్నాను. కానీ.. సుధీర్ బాబు యాక్టర్ గా గుర్తించాడని ఎద్దేవా చేశారు. అంటే.. మేమంతా నటిస్తున్నామా? అంటూ కేటీఆర్ ఫన్నీగా మాట్లాడారు. 2018లో ఈ కార్యక్రమం లో పాల్గొనప్పుడే ఇది ఎంటర్టైన్మెంట్ రంగంలో మంచి కార్యక్రమం అవుతుంది అనుకున్నానని… ఇండియా లో ఇంటర్నెట్ యూజర్స్ రోజురోజుకి పెరుగుతున్నారన్నారు. ఇమేజ్ సెక్టార్ ఏడాదికి 13.4% పెరుగుతుందని అంచనా వేస్తున్నారని తెలిపారు. ఓటీటీ , గేమింగ్ కు ఆదరణ పెరుగుతోందని… తాను ఓటీటీ కి అభిమానిని అని వెల్లడించారు మంత్రి కేటీఆర్‌.