బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 10 జులై 2021 (16:08 IST)

కొత్త బిచ్చగాడు మంత్రి కేటీఆర్ : మధు యాష్కీ

తెలంగాణ రాష్ట్ర మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ కాంగ్రెస్ నేతలను తిట్టడమే వీరు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. 
 
కాంగ్రెస్ నేతలను కొత్త బిచ్చగాళ్లుగా పేర్కొన్న కేటీఆర్‌పై మధు యాష్కీ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త బిచ్చగాళ్లం తాము కాదని… కేటీఆరే కొత్త బిచ్చగాడు అంటూ వ్యాఖ్యానించారు. రోజుకో వేషం వేసుకుంటూ, పూటకో అబద్ధం చెపుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నావని మండిపడ్డారు.
 
కాంగ్రెస్ పార్టీలో గెలిచి, అధికార పార్టీకి అమ్ముడుపోయిన నేతలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెపుతామన్నారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో పాటు నిత్యావసరాల ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నాయని… బీజేపీ, టీఆర్ఎస్‌లకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.