ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 మే 2021 (17:50 IST)

వదినపై అలా కసి తీర్చుకున్నాడు.. హత్య చేసి.. శవాన్ని కాల్చేశాడు..

పగతో వదినపై కసి తీర్చుకున్నాడు.. ఓ మరిది. వదినను అతి కిరాతకంగా మరిది హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటి పరిధిలోని రామాపురంలో చోటుచేసుకుంది. వదినను చంపి ఆ తర్వాత శవాన్ని కాల్చేశాడు. ఆపై పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ ఘటన శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే. మృతురాలి పేరు రేక బయ్యమ్మ(55). రామాపురంలో తన ఇంట్లో ఒంటరిగా ఉంటుంది.
 
తనను జైలుకి పంపిందనే ప్రతీకారంతోనే వదినను హత్య చేసినట్టు నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. 2004లో జరిగిన సోదరుడు రేఖ పిచ్చయ్య హత్య కేసు తనపై అన్యాయంగా మోపడంతో తాను మూడు నెలలు జైలులో ఉన్నానని.. ఆ పగతోనే వదినను హత్య చేశానని సైదులు పోలీసులతో చెప్పాడు.
 
ఇటీవల నుంచి ఇంటి స్థలం, పొలం విషయంలో తరచుగా గొడవ జరుగుతోందని వీటిని దృష్టిలో పెట్టుకుని తన తల్లి బయ్యమ్మను హత్య చేశారని మృతురాలి కూతురు కవిత చెప్పింది. హుజూర్‌నగర్‌ సీఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 
 
మృతదేహాన్ని తీసుకెళ్లిన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. బయ్యమ్మ కూతరు ఫిర్యాదు మేరకు పోలీసులు రేక సైదులు, భార్య ఎల్లమ్మ, ఇద్దరు కుమారులు ఉపేందర్‌, హేమంత్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.