సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (07:50 IST)

తిట్టాడనీ వ్యక్తి మర్మాంగాన్ని కోసేశాడు...

తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. తనను తిట్టడంతో తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి ప్రత్యర్థి చెవి, మర్మాంగాన్ని కోసేశాడు. ఆపై పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 
 
పొలీసుల కథనం ప్రకారం హైదరాబాద్‌కు చెందిన రుద్రారపు కార్తీక్ తోపుడు బండిపై చిల్లర సామాన్లు విక్రయిస్తుంటాడు. ఐదు రోజుల క్రితం కొత్తగూడెం రుద్రంపూర్ ప్రాంతానికి వలస వచ్చి స్థానికంగా శిథిలమైన ఓ భవనంలో నివసిస్తున్నాడు. 
 
అదే ప్రాంతంలో నివసిస్తున్న కూలీ హుస్సేన్ పాషా మంగళవారం మద్యం మత్తులో కార్తీక్‌ను దూషించాడు. ఇది ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. ఘర్షణ మరింత పెరగడంతో కోపంతో ఊగిపోయిన కార్తీక్.. పాషా చెవి, మర్మాంగాన్ని కత్తితో కోసేశాడు. 
 
ఆ తర్వాత ‘డయల్ 100’కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.