గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 జూన్ 2022 (09:32 IST)

75 ఏళ్లలో ప్రేమ.. మూడో పెళ్లికి నో చెప్పారని ఆత్మహత్య.. ఎక్కడ?

Love
ఓ వ్యక్తికి 75 ఏళ్లలో ప్రేమ చిగురించింది. ఆ ప్రేమను ఇంటి సభ్యులతో చెప్పాడు. పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా వున్నట్లు తెలిపాడు. కానీ కుటుంబ సభ్యులు వద్దన్నారని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు భార్యలు, ఆరుగురు పిల్లలతో సంసారం కలకలలాడుతున్నా కూడా, కానీ ఆయన మరో మహిళ మీద ప్రేమ కలిగింది. 
 
ఎలాగైనా ఆమెను మూడో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఇద్దరు భార్యలు పిల్లలు నో చెప్పారు. దీంతో తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టిడి గుట్టకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి అబ్దుల్ రెహ్మాన్ వయసు 75 ఏళ్లు. ఆయనకు ఇద్దరు భార్యలు, ఆరుగురు సంతానం. ఆయన సంతానంలో ఇంకా ముగ్గురికి పెళ్లిళ్లు కాలేదు. వారి పెళ్లిళ్ల విషయం మరచిన ఆ పెద్ద మనిషి తన మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు. 
 
రెహ్మన్ ఎంతగా చెప్పినా కుటుంబ సభ్యులు ఆయన మూడో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రికి తీసుకెళ్తే చికిత్స పొందుతూ అర్థరాత్రి తర్వాత మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.