గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 31 జులై 2017 (14:54 IST)

బట్టలూడదీశాడంటూ తమ్ముడి భార్య ఫిర్యాదు... అవమానంతో బావ సూసైడ్ అటెంప్ట్

ఓ తప్పుడు ఫిర్యాదుకు ఓ వ్యక్తి బలవన్మరణయత్నానికి పాల్పడ్డాడు. తన బట్టలూడదీశాడంటూ బావపై తమ్ముడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీన్ని అవమానంగా భావించిన ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప

ఓ తప్పుడు ఫిర్యాదుకు ఓ వ్యక్తి బలవన్మరణయత్నానికి పాల్పడ్డాడు. తన బట్టలూడదీశాడంటూ బావపై తమ్ముడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీన్ని అవమానంగా భావించిన ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... జిల్లాలోని వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో ఏడెల్లి భూమిరెడ్డి, శ్రీనివాసరెడ్డి అన్నదమ్ములు. వీరి మధ్య పొలం తగాదాలు ఉన్నాయి. తన భూమిని సాగు చేసేందుకు భూమిరెడ్డి వెళ్లిన వేళ, శ్రీనివాసరెడ్డి, ఆయన భార్య సునీత అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. 
 
దీంతో సునీత మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించి, తన బావ బట్టలూడదీశాడని, అవమానించాడని ఫిర్యాదు చేసింది. ఈ విషయం గ్రామంలో తెలియడం, పలువురు అడగడంతో అవమానంతో కుంగిపోయిన భూమిరెడ్డి, పురుగుల మందు తాగాడు. దీన్ని గమనించిన ఇరుగు పొరుగు వారు అతన్ని జమ్మికుంటలోని ఆసుపత్రికి తరలించారు.