ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2023 (09:45 IST)

మంజీరా నీటి సరఫరాకు అంతరాయం.. ఏయే ప్రాంతాల్లో అంటే...

tap water
భాగ్యనగరిలో మంజీరా నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. రెండు రోజుల పాటు ఈ పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ నగర జలమండలి అధికారులు తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దాదాపు 30కి పైగా ప్రాంతాల్లో పాక్షికంగా లేదా పూర్తిగా నీటి సరఫరా నిలిపివేస్తామని తెలిపారు. 
 
హైదరాబాద్ మహానగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న మంజీరా వాటర్‌ సప్లై ఫేజ్‌-2లో కలబ్‌గూర్‌ నుంచి పటాన్‌ చెరు వరకు పైప్‌లైన్‌కు జంక్షన్‌ పనులు జరగనున్నాయి. ఆర్‌అండ్‌బీ శాఖ బీహెచ్‌ఈఎల్‌ క్రాస్‌ రోడ్ వద్ద నూతనంగా నిర్మిస్తోన్న ఫ్లైఓవర్‌ పనులకు ఆటంకం లేకుండా ఈ జంక్షన్‌ పనులు చేపట్టనున్నారు. దీంతో కొన్ని ప్రాంతాలకు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. 
 
కాగా, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలను పరిశీలిస్తే, 
ఓఅండ్ఎం డివిజన్ నెం.6 : ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌ నగర్‌, అమీర్ పేట్ (తదితర ప్రాంతాల్లో పాక్షిక అంతరాయం)
ఓఅండ్ఎం డివిజన్ నెం.8 : ఈ డివిజన్ పరిధిలోని ఆఫ్ టేక్ పాయింట్లు, బల్క్ కనెక్షన్లు
ఓఅండ్ఎం డివిజన్ నెం.9 : కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్టలో తాగు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుంది.
ఓఅండ్ఎం డివిజన్ నెం.15 : ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారాం, దీప్తి శ్రీనగర్, మదీనాగూడ, మియాపూర్.
ఓఅండ్ఎం డివిజన్ నెం.24 : బీరంగూడ, అమీన్‌పూర్ తదితర ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడనుంది. ఈ ప్రాంతాల్లో వినియోగదారులు మంజీరా తాగు నీరు పొదుపుగా వాడుకోవాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.