శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 మే 2023 (14:48 IST)

2024 ఆసియాలోనే అతిపెద్ద మేడారం జాతర.. ఎప్పుడంటే..?

2024 ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారయ్యాయి.వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు గిరిజన జాతర జరుగుతుంది. 
 
సంప్రదాయం ప్రకారం తొలిరోజు సారక్క విగ్రహాన్ని కన్నెపల్లి నుంచి మేడారం వరకు, పగిడిద్ద రాజు విగ్రహాన్ని పూనుగొండ్ల నుంచి మేడారం వరకు తీసుకువెళ్లనున్నారు. రెండవ రోజు కొండాయి గ్రామం నుండి గోవిందరాజు విగ్రహంతో పాటు సమ్మక్క దేవి విగ్రహం, కుంకుమ పేటికను మేడారంకు తీసుకువస్తారు. 
 
మూడవ రోజు భక్తులు వనదేవతలకు పూజలు చేయగా, చివరి రోజు "తల్లుల వనప్రవేశం"తో జాతర ముగుస్తుంది. కుంకుమ పేటిక (సమ్మక్క) చిలకలగుట్టకు తిరిగి వచ్చి తదుపరి పండుగ వరకు అక్కడే ఉంచబడుతుంది. ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు మేడారం వద్ద ప్రార్థనలు చేస్తారు.