శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 మే 2022 (22:58 IST)

మెట్రో ట్రాక్‌పైకి గంటపాటు నిలిచిపోయిన వ్యక్తి.. చివరికి?

hyderabad metro rail
సికింద్రాబాద్ వెస్ట్ రైల్వే స్టేషన్ వద్ద ఓ వ్యక్తి మెట్రో ట్రాక్‌పైకి రావడంతో ఓ గంట పాటు సింగిల్ ట్రాక్‌పైనే నిలిచిపోయాడు. దీంతో రైలు ఆగిపోయింది. 
 
వివరాల్లోకెళ్తే.. సికింద్రాబాద్ వెస్ట్ రైల్వే స్టేషన్ వద్ద ఓ వ్యక్తి మెట్రో ట్రాక్‌పైకి అడ్డంగా వచ్చాడు. దాంతో అది గుర్తించిన మెట్రో సిబ్బంది, అధికారుల సుమారు గంట పాటు ఆ మార్గంలో సింగిల్ ట్రాక్‌పై మెట్రో రైలును నడిపారు. 
 
ఈ క్రమంలో మెట్రో ట్రాక్‌పై వెళ్లిన యువకుడిని సిబ్బంది పట్టుకుని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అనంతరం యధావిధిగా మెట్రో ట్రెన్స్‌ను పునరుద్ధరణ చేశారు.