మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: సోమవారం, 22 మార్చి 2021 (22:15 IST)

ఈటల రాజేందర్‌ను తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిన మంత్రి కేటీఆర్, ఎందుకో?

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌తో మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం వల్భాపూర్‌లో ఈటల హాట్ కామెంట్స్ చేశారు. ఈటల వ్యాఖ్యల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే అలాంటిది ఏమీ లేదని కరోనాపై చర్చించడానికే అని టీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నారు.
 
అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఈటలను తన కారులో ఎక్కించుకుని మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం వల్భాపూర్‌లో ఆయన రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులం, డబ్బు, పార్టీ జెండా ఏదీ శాశ్వతం కాదని, మనిషిని గుర్తుంచుకోవాలని అన్నారు.
 
మహాభారతంలో కౌరవులు, దుర్యోధనుడు ఉండబట్టే పాండవులకు అంత పేరు వచ్చిందని.. సమాజంలో కూడా అందరూ ఒకేలా ఉండరని పేర్కొన్నారు. మోసం చేసిన హృదయాలు మంచిగా ఉండవని, ఇబ్బంది పడతాయని చెప్పారు. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ.. అంతిమ విజయం వాటిదేనన్నారు.